KRNL: ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర పురస్కరించుకుని బీవీ మోహన్ రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. స్వయంగా క్రీడాకారులతో కలిసి ఆడి వారిని ఉత్సాహపరిచారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని ఇస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.