ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామ పంచాయతీలో గత రెండేళ్లుగా మూలనపడి తుప్పు పట్టిన ట్రాక్టర్లను ఇవాళ నూతన సర్పంచ్ కాకులమర్రి శ్రీలత – లక్ష్మణ్ బాబు మరమ్మత్తు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలు నిధులు లేక పారిశుధ్య పనులు అటుకే పోయాయని విమర్శించారు. “గ్రామ శుభ్రతలో రాజీ పడను” అని సర్పంచ్ హామీ ఇచ్చారు.