BPT: జనవరి 10 నుంచి 14 వరకు జరిగే నేషనల్ ఖోఖో సబ్ జూనియర్ పోటీలకు బాపట్ల నియోజకవర్గం నుంచి బాలురు, బాలికల జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. ఈ సందర్భంగా రీకా వ్యాలీ సంస్థ ఆధ్వర్యంలో జెర్సీలను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు చేతుల మీదుగా డైరెక్టర్ నిజాం అందజేశారు. పోటీల్లో ప్రతిభ చూపి బాపట్లకు మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.