VKB: పెద్దముల్ మండల పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి త్వరలోనే రెండు కొత్త సబ్ స్టేషన్లు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తాండూరు విద్యుత్ శాఖ ఏడీ శంకర్ నాయక్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాషాపూర్, కొండాపూర్ గ్రామాల్లో రూ.4 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.