HYD ప్రజలకు జలమండలి ఓ సూచన చేసింది. HMWSSB పరిధిలో అసలు అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు జీరోకు చేర్చడం లక్ష్యంగా విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నట్లు ఎండి అశోక్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు. అక్రమ నల్ల కనెక్షన్ ముచ్చట తెలిసిన వెంటనే, 9989998100, 9989987135 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.