MBNR: మహమ్మదాబాద్ మండల పరిధిలో జనవరి 7 నుంచి 11 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ సురేష్ వెల్లడించారు. గౌరిదేవిపల్లి వద్ద వాల్వ్ నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉన్నందున ముడి నీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు. ఐదు రోజుల పాటు నీటి అంతరాయం ఉంటుందని, ప్రజలు ఇబ్బంది పడకుండా స్థానిక పంచాయతీల్లోని ప్రత్యామ్నాయ వనరులను వాడుకోవాలని సూచించారు.