NLG: ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో వ్యక్తి మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పగిండ్ల ఉప్పలయ్య (50) హైదరాబాదుకు తన హోండా యాక్టివా ద్విచక్ర వాహనంపై వెళుతూ గుండ్రాంపల్లి వద్ద అదుపుతప్పి రోడ్డు ప్రక్కన గల సూచిక బోర్డును ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కాగా చౌటుప్పల్‌కు తరలించారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించగా డ్యూటీ వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.