ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అశ్మిత్ రెడ్డి గురువారం బీజేపీ నాయకుడు చవ్వా రంగనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తిరుప్పావై పూజలో పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో అర్చకులు చింతల రాయల్ గోదాదేవి విశిష్టతను వివరించారు. అనంతరం పెద్దపప్పూరు మండలం పసులూరు గ్రామంలో టీడీపీ నాయకుడు గంగరాజు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.