KRNL: ఆదోని మండలానికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఎన్నిక కావడం పట్ల ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. వైసీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.