KMM: జిల్లాలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ వందేళ్ల వేడుకలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ పోరాటాలు సాగిస్తోందన్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జాతీయ స్థాయి నాయకులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.