NLR: ఉదయగిరి సివిల్ సప్లయిస్ గోదాంలో రూ. 1.05 కోట్ల విలువైన బియ్యం, సరుకులు మాయమైన కేసులో ఆత్మకూరు సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురిని పోలీసులు రెండు రోజుల పాటు విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ సరుకుల విలువ రూ. 2.10 కోట్లుగా ఉంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసుపై మరింత లోతుగా విచారణ చేపట్టారు.