AP: రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులు, బార్లపై విధించిన అదనపు సుంకాన్ని రద్దు చేసింది. కొన్ని రకాల మద్యం బాటిళ్లపై ధరను రూ.10, రిటైలర్ల మార్జిన్‌ను 1% పెంచింది. ఈ మార్పులతో ప్రభుత్వానికి రూ.506 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. అయితే.. క్వార్టర్ బాటిళ్లు, బీరు, వైన్, రెడీ టు డ్రింక్స్‌పై ఈ పెంపు వర్తించదు.