MDK: కౌడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవన పనులను జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ శివదయాళ్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం ప్రస్తుతం ఆసుపత్రిలోని రికార్డులు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.