SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు సమ్మిరెడ్డి శుక్రవారం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన పీఎం శ్రీ క్రీడా పోటీల్లో లాంగ్ జంప్‌లో మనిషా (ప్రథమ), పరమేష్ (ద్వితీయ), వంద మీటర్ల పరుగు పందెంలో ధనుష్ (ప్రథమ) స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.