ASF: కాగజ్ నగర్ మండలం భట్ పల్లి గ్రామ పంచాయతీ ప్రధాన రహదారి మూలమలుపు వద్ద మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ శుక్రవారం అదుపు తప్పి ట్రాలీ బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ముప్పు తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి ట్రాక్టర్ రోడ్డుపై నుంచి తొలగించడంతో రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.