NZB: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను నీలా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తమ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసి, సహకరించాలని ఈ సందర్భంగా వారు ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో నీలా గ్రామ సర్పంచ్ క్యాతం యోగేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.