ADB: నార్నూర్ మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీ వద్ద శుక్రవారం క్రికెట్ టోర్నమెంట్ను మాజీ ఏఎంసీ ఛైర్మన్ శ్రీరామ్ నాయక్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన క్రీడాకారులతో సమావేశమై మాట్లాడారు. యువత క్రీడా పోటీలను నేర్చుకొని ఉండాలని, రోజు ఒక గంట పాటు క్రీడలు ఆడాలన్నారు. దీనితో మానసికంగా మెరుగుపడుతామని పేర్కొన్నారు.