AP: సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని జగన్ చేసిన వ్యాఖ్యలపై CM చంద్రబాబు మండిపడ్డారు. బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడరు అని అన్నారు. ఇడుపులపాయలో CM కూర్చుంటే అది రాజధాని అవుతుందా? బెంగుళూరులో కూర్చుంటే అదే రాజధాని అవుతుందా? అని ప్రశ్నించారు. అమరావతిని దెబ్బతీసేందుకే ఇలాంటి విషయ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.