ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అధికారులతో కలిసి వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అలాగే రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించడం జరుగుతుందని పీవో తెలిపారు.