KNR: మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం అభివృద్ధి చెందుతుందని, అందువల్ల ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం బొమ్మకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. అందులో కలెక్టర్ పాల్గొన్ని మాట్లాడారు.