యాలకులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి. నోటి దుర్వాసనను దూరం చేసి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో హార్మోన్లను, అధిక బరువును నియంత్రిస్తాయి. నెలసరి నొప్పులను తగ్గిస్తాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.