VZM: రాజాం మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావు ఇవాళ స్దాయ హరిజన చిన్న వీధిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలువలు, రోడ్లు పరిశీలించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్యలున్నా చెప్పాలని, వెంటనే పరిష్కరిస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన వారికి సూచించారు.