W.G: పండుగలు మన సంస్కృతికి ప్రతీకలని నరసాపురం డీఎస్పీ డా. జీ.శ్రీవేద అన్నారు. శుక్రవారం నరసాపురం వైఎన్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా, ఇలా విద్యార్థుల మధ్యకు వచ్చి సంక్రాంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని డీఎస్పీ అన్నారు. పండుగ పూట ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా, ఆనందంగా గడపాలని కోరారు.