ATP: పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ గనిని అధికారులు తాజాగా సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఏడేళ్లుగా ఖనిజాన్ని తరలిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో ఈ చర్యలు చేపట్టారు. గనిలోని బలపం రాయి, డోలమైట్ నిల్వలను మైనింగ్ అధికారి వరప్రసాదరెడ్డి పరిశీలించారు. యంత్రాలు, ఖనిజాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.