KNR: జిల్లా స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ పోటీల్లో శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థిని ఉమేజా ఇరం మెరిసింది. జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ కె. ప్రభాకర్ నిన్న వెల్లడించారు. విద్యార్థినిని అభినందిస్తూ, రాష్ట్రస్థాయిలోనూ రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.