SDPT: జగదేవపూర్ ఎంపీడీవోగా పీ.వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది స్వాగతం పలుకుతూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ఖాజా మొయినుద్దీన్, కార్యాలయ సిబ్బంది జూనియర్ అసిస్టెంట్లు శైలజ, యాదయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.