SS: అమరావతి-బెంగళూరు జాతీయ ఆర్థిక కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే 544జీ నిర్మాణ పనులను MLA కందికుంట వెంకట ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం సాదార్ల పల్లి సమీపంలో జరుగుతున్న పనుల వద్దకు వెళ్లి అధికారులతో చర్చించారు. రాజ్ పత్ ఇన్ఫ్రా కాన్ సంస్థ ఎండీ జగదీష్ కదం, హైవే అధికారులతో కలిసి పనుల నాణ్యతను తనిఖీ చేశారు.