ATP: గుత్తి మండలం తొండపాడు బోలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఆలయంలో టెంకాయల విక్రయానికి వేలంపాట నిర్వహించారు. ఈఓ శోభ మాట్లాడుతూ.. ఏడాదిపాటు ఆలయంలో టెంకాయలవిక్రయానికి రూ.6.60 లక్షలకు ఉమాదేవి పాడగా, 9రోజుల బ్రహ్మోత్సవాలకు పుల్లయ్య అనే వ్యక్తి రూ.3.85 లక్షలకు టెంకాయల విక్రయానికి వేలంపాట పాడారని తెలిపారు.