ATP: గుంతకల్లులొ లైన్ల నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ అధికారులు నాగేంద్రప్రసాద్, రఘునాథ్ శుక్రవారం తెలిపారు. భాగ్యనగర్, హౌసింగ్ బోర్డ్, పాత బస్టాండ్, మస్తాన్ పేట, పీఎన్టీ కాలనీ, హనుమేష్ నగర్,మోదీనాబాద్, మండి బజార్, తదితర ప్రాంతాలలో నిలుపువేస్తున్నట్లు తెలిపారు