పార్వతీపురంలోని నవిరికాలనీ కూడలి వద్ద మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహాన్ని శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీన్.మాధవ్ ఆవిష్కరించారు. అటల్ – మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సభకు మంత్రి సంధ్యారాణి, పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.