E.G: ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాస సోదర సోదరీమణులకు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస భారతీయులు ఏపీ అభివృద్ధికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న శక్తి అన్నారు. పెట్టుబడులు, నైపుణ్యాల మార్పిడి, విద్య, వైద్యం, పరిశ్రమల రంగాల్లో ప్రవాసుల అనుభవం రాష్ట్ర పునాదిగా మారుతోందని తెలిపారు.