E.G: కొవ్వూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు పేర్కొన్నారు. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కనీవిని ఎరుగని రీతిలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.