VZM: వేపాడ మండలం గుడివాడ ఎంపీపీ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎంఈవో-1 ఎన్ నాగభూషణరావు శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వార్షిక తనిఖీపై రివ్యూ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు సిబ్బంది పాల్గొన్నారు.