PPM: సీతానగరం మండలం కాసాపేట గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున లారీ, వ్యాన్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పార్వతీపురం వైపు నుంచి ఆయిల్ డబ్బాల లోడ్‌తో వెళుతున్న వ్యాన్ విజయనగరం వైపు నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టడంతో వ్యాన్‌లో ఉన్న ఆయిల్ డబ్బాలు చెల్లాచెదురుగా రోడ్డు మీద పడి వ్యాన్ ప్రక్కన పొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.