TG: రాష్ట్రంలో సికింద్రాబాద్ పేరును తొలగించే కుట్ర జరుగుతోందని BRS నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండానే డీలిమిటేషన్ చేశారని.. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 17న భారీ ర్యాలీ తీస్తామని.. త్వరలో సికింద్రాబాద్ బంద్కు పిలుపునిస్తామని హచ్చరించారు. CMకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చాలని సవాల్ విసిరారు.