KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం ప్రముఖ హీరోయిన్ అర్చన అయ్యర్ వచ్చారు. ఆమెకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. గ్రామదేవత మంచాలమ్మ దేవున్ని, మూల బృందావనాన్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు.