BHNG: సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా రూట్ మారుస్తూ కొత్తగా ఏపీకే ఫైల్స్ వాట్సాప్ షేర్ చేస్తున్నారు. గురువారం రాజపేటలో ఒక గ్రూపులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ విత్ ఆధార్ ఇమేజ్‌తో కూడిన మెసేజ్‌లు పంపారు. అచ్చం బ్యాంకు వారు పంపినట్లుగానే ఉండడంతో తెలియకుండా కొందరు నొక్కే ప్రమాదం ఉన్నది .ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి వాటిని ఎదుర్కోవాలని పోలీసులు తెలిపారు.