NZB: నందిపేట పరిధిలోని ఉర్దూ మీడియం స్కూల్ సమీపంలో 10, 11 వార్డుల్లో సీ.సీ. రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త రోడ్డు నిర్మాణంతో స్థానికుల రాకపోకల సమస్య శాశ్వతంగా తీరనుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాంచందర్ వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.