NDL: వాహన చోదకులు హెల్మెట్ ధరించకుండా పెట్రోల్ బంకులోకి వస్తే పెట్రోల్ కొట్టరాదని శుక్రవారం కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు సూచించారు. పెట్రోల్ బంకుల్లో సిబ్బందికి అవగాహన కల్పించి, ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.