NRPT: వరంగల్‌లో జరిగిన 44 వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో జిల్లా జట్టు మూడో స్థానం సాధించింది. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన హిందూపూర్ గ్రామానికి చెందిన కీర్తి కుమారి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 9 నుంచి 11 వరకు మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగే జాతీయ సీనియర్ షూటింగ్ బాల్ పోటీల్లో ఆమె పాల్గొననున్నారు.