నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్నాటి కార్తీక్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు గుర్తుగా ఉన్న నిజామాబాద్ జిల్లా పేరును తొలగించి ఇందూర్ జిల్లాగా మార్చాలన్నారు.