ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో గూగుల్ (ఆల్ఫాబెట్) సత్తా చాటింది. టెక్ దిగ్గజం యాపిల్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో గూగుల్ షేర్లు పుంజుకోవడంతో ఈ ఘనత సాధ్యమైంది. దీంతో యాపిల్ మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఈ పరిణామం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.