NZB: కాంగ్రెస్ పార్టీ నూతన ఉపాధి హామీ చట్టంపై దుష్పచారం చేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..100 రోజులు ఉన్న పని దినాలను 125 రోజులకు కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం దురదృష్టకరమన్నారు.