MBNR: ముడా ద్వారా నగరంలో శాశ్వత అభివృద్ధి జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ అర్బన్ అథారిటీకి సంబంధించిన లోగోను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.