MNCL: సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ ఉద్యోగులు టీఎన్జీవోస్తో కలిసి రావాలని జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి పిలుపునిచ్చారు. గురువారం జైపూర్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవోస్లో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.