W.G: భీమవరం మండలంలోని రైతు సేవా కేంద్రాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు అధిక దిగుబడులు సాధించే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ పద్ధతుల గురించి తెలియజేయాలన్నారు.