MDCL: అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్‌ను కలిసి డివిజన్లోని పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. చినరాయుని చెరువు, కొత్త చెరువులలో నీటి కలుపు తొలగింపు, దోమల నియంత్రణ, బండబస్తీ ప్రాంతంలో వినియోగంలో లేని నీటి ట్యాంక్ కూల్చివేత, ధోబీ ఘాట్ బోర్వెల్ మరమ్మతులు చేపట్టాలని కోరారు.