AP: తిరుమలలో మద్యం బాటిళ్లు కనిపించడంపై జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శలు చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కనుసన్నల్లోనే మద్యం బాటిళ్ల ఎపిసోడ్ జరిగిందని ఆరోపించారు. భూమనని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మద్యం బాటిళ్ల వ్యవహారంలో వైసీపీ పాత్ర ఉందని చెప్పారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు.