TG: బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే.. రాజ్యాంగాన్ని మార్చేసేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో తమకు 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు ప్రచారం చేశారన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా పేదల హక్కులు కాలరాయాలని చూసిందన్నారు. కార్పొరేట్లకు దేశాన్ని అప్పగించే ప్రయత్నం చేసిందన్నారు. ప్రజలను కాంగ్రెస్ అప్రమత్తం చేయడం వల్ల బీజేపీకి సీట్లు తగ్గాయన్నారు.