ప్రకాశం జిల్లాలో గంజాయి సాగును అరికట్టేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు ‘స్కై ప్రాజెక్టు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పంట పొలాలు, పరిసర ప్రాంతాలలో డ్రోన్ల సహాయంతో గంజాయి మూలాలను గుర్తిస్తున్నారు. ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.